Pakistan: ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాలు కూడా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. అయితే, ఈ వివాదాలు తగ్గేలా టర్కీ వేదికగా రెండు దేశాలు శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. షాకింగ్ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై జరుగుతున్న డ్రోన్ దాడుల్ని అడ్డుకోలేమని, దీనికి ఒక విదేశంతో జరిగిన రహస్య ఒప్పందం కారణంగా అని చెప్పింది.
అయితే, పాకిస్తాన్ ఈ ఒప్పుకోలుతో అన్ని వేళ్లు అమెరికా వైపు వెళ్తున్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. కాబూల్‌లో ఉన్న బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తమకు ఇవ్వాలని ట్రంప్, తాలిబాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా కోరాడు. ఒకవేళ దీనికి ఒప్పుకోకుంటే ‘‘చెడు పరిణామాలు’’ సంభవిస్తాయని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ దాడుల వెనక అమెరికా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ నుంచి జరుగుతున్న డ్రోన్ దాడుల్లో మూడో దేశం ప్రయేమం ఉన్నట్లు ఆఫ్ఘాన్‌కు చెందిన టోలో న్యూస్ తెలిపింది.
Read Also: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. పీకేకి ఓటర్ ఐడీ పోటు.. రంగంలోకి ఈసీ!
ఇటీవల పాకిస్తాన్ సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందాన్ని కుదర్చుకోవడం, అమెరికాతో సన్నిహితంగా మెలుగుతోంది. పలు సందర్భాల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు గొప్ప వ్యక్తులు అంటూ కొనియాడారు. దీంతో, తాజాగా పాక్ డ్రోన్ దాడుల వెనక అమెరికా ఉందా..? అనే చర్చ నడుస్తోంది.
పాకిస్తాన్ మాత్రం ఏ విదేశంతో ఒప్పందం ఉందీ అనే విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం టర్కీ వేదికగా జరుగుతున్న ఆఫ్ఘాన్-పాక్ శాంతి చర్చలు ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. చర్చల సమయంలో పాక్ ప్రతినిధి బృందం శాంతి కోసం ఆసక్తిగా ఉన్నట్లు కనిపించలేదని నివేదికలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేశాయి.