Pakistan train hijack: పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మనం చాలా సార్లు విమానాలు, ఓడలు, బస్సులు హైజాక్ కావడాన్ని చూశాం. అయితే, రైలును హైజాక్ చేయడం అనేది చాలా కఠినం, అలాంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ వెళ్తున్న రైలును హైజాక్ చేశారు.
Pakistan Train Hijack: పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్‌లో ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ హైజాక్‌కి గురైంది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలుని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఫైటర్స్ హైజాక్ చేశారు. అయితే, ఈ ఘటన వెనక భారతదేశ హస్తముందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గురువారం ఆరోపించింది. ఈ హైజాక్‌లో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు బలూచ్ ఫైటర్స్ చేతిలో మరణించారు.