విజయ్ దేవరకొండ ,సమంత జంట గా నటించిన పాన్ ఇండియా మూవీ ఖుషి .ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తం ,గా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చాట్ బస్టర్ గా నిలిచాయి.సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గానే వున్నాయి..ఈ సినిమా విజయం విజయ్ కెరీర్ కు ఎంతో కీలకం. అందుకే అతను ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.తాజాగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.ఖుషి నుంచి రీసెంట్ గా ఆరాధ్య పాట విడుదలైన విషయం తెలిసిందే.. ఈ పాట ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ గా మారింది.ఎక్కడ చూసిన కూడా ఆరాధ్య పాటే వినిపిస్తోంది.
ఆరాధ్య పాట విన్న ప్రతి ఒక్కరికి ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతుంది.అందుకే విడుదలైన కొద్ది రోజుల్లోనే చాట్ బస్టర్ గా నిలిచింది.ఈ సాంగ్ లో పెళ్లి తర్వాత భార్యా భర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు.. ప్రేక్షకులే కాదు విజయ్ కూడా ఈ సాంగ్ కు బాగా కనెక్ట్ అయ్యాడని సమాచారం.అందుకే సోషల్ మీడియా వేదికగా ఈ పాట గురించి స్పందించాడు. “ఖుషి సినిమాలో ఆరాధ్య పాట నా మనసుకు బాగా నచ్చింది ఈ సాంగ్ లో పెళ్లి తరువాత దంపతులు ఎలా ఉండాలో చక్కగా చూపించారు. వారి మధ్య రిలేషన్ ను ఎంతో అందంగా ప్రజెంట్ చేశారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ.. నాకు పెళ్లైన తరువాత, నా భార్య తో ఈ పాట లో ఉన్నట్లే ఉండాలని అయితే కోరుకుంటున్నాను” అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.