Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలపై అణుదాడికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా ప్రభుత్వ వార్త సంస్థ కేసీఎన్ఏ సోమవారం ఈ వ్యాఖ్యలను ధ్రువీకరించింది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాని కిమ్ తప్పుపట్టారు. ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.
Read Also: Karthikeya 2: నిఖిల్ రేంజ్ మామూలుగా లేదుగా!
అంతకు ముందు ఆదివారం ఉత్తర కొరియా డమ్మీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇరు దేశాలకు బలమైన సంకేతం పంపేందుకు ఈ ప్రయోగం చేసింది. యుద్ధంలో ప్రతిదాడి చేయడానికి, అణు ప్రతిదాడి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ కసరత్తు చేసినట్లు ఉత్తర కొరియా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి 800 కిలోమీటర్లు ప్రయాణించి 800 మీటర్ల ఎత్తులో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ప్రయోగాలపై కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. తాజాగా జరిగిన క్షిపణి ప్రయోగాలకు కిమ్ తన 9 ఏళ్ల కూతురు జుఏ తో హాజరయ్యారు.
అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు దాదాపుగా 8 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. గత వారం ఒక్క రోజులోనే ఉత్తర కొరియా ఏకంగా నాలుగు క్షిపణి ప్రయోగాలను చేసింది. అమెరికా, సౌత్ కొరియా కలిసి ఫ్రీడమ్ షీల్డ్ పేరుతో 11 రోజుల పాటు మిలిటరీ ఎక్సర్ సైజ్ నిర్వహించాయి. వీటికి వ్యతిరేకంగా నార్త్ కొరియా తన అణుయుద్ధ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.