Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News North Korea Says Its Spy Satellite Crashed Into Sea

North Korea: సముద్రంలో కుప్పకూలిన నార్త్ కొరియా స్పై శాటిలైట్..

Published Date :May 31, 2023 , 7:13 am
By Venu Goapl Reddy
North Korea: సముద్రంలో కుప్పకూలిన నార్త్ కొరియా స్పై శాటిలైట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

North Korea: ఉత్తర కొరియా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూఢచారి ఉపగ్రహం సముద్రంలో కుప్పకూలింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఎంతో కీలకంగా భావించారు. జపార్, సౌత్ కొరియాల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రయోగం చేపట్టారు. అయితే శాటిలైట్ ప్రయోగ సమయంలో రాకెట్ లో సాంకేతిక లోపం సంభవించింది. దీంతో సముద్రంలో కుప్పకూలిపోయినట్లు ఆదే మీడియా వెల్లడించింది.

ఈ ప్రయోగానికి కిమ్ చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. స్వయంగా ఆయన వెళ్లి సైంటిస్టులతో మాట్లాడటంతో పాటు ప్రయోగాన్ని సమీక్షించారు. తన కుమార్తె జుయితో కలిసి ఇటీవల రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించారు. ఉత్తర కొరియా అధికారుల ప్రకారం.. నార్త్ ఫియోంగాన్ ప్రావిన్స్‌లోని చోల్సాన్ కౌంటీలోని సోహే శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి చొల్లిమా-1 అనే రాకెట్ ద్వారా మల్లిగ్యోంగ్-1 అనే సైనిక స్పై శాటిలైట్ ను ప్రయోగించారు. రాకెట్ మొదటి దశ పూర్తయిన తర్వాత రెండో దశలో రాకెట్ లో ఇంజిన్ అసాధారణంగా పనిచేయడంతో సముద్రంలో కూలిపోయింది. ప్రయోగం విఫలం అవడానికి కారణాలు అణ్వేషించి త్వరలో రెండో ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.

Also Read

  • Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
  • Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..

Read Also: Air India: ఫ్లైట్ లో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. సిబ్బంది పై దాడి..

ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిందని.. ఇది రాడార్ నుంచి అదృశ్యమైందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగం గురించి ఒక రోజు ముందు జపాన్ కు సమాచారం ఇచ్చింది. జపాన్, దక్షిణ కొరియా ఈ ప్రయోగాన్ని తీవ్రంగా విమర్శించాయి. బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతతో కూడిన ఎలాంటి పరీక్షల నుంచి ఉత్తర కొరియాను నిరోధించేలా ఐక్యరాజ్య సమితిని ఆంక్షలను ఉల్లంఘించిందని విమర్శించాయి.

ఉత్తర కొరియా, అమెరికా-దక్షిణ కొరియాల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ ఇటీవల కాలంలో విపరీతంగా బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షిస్తూ పోతోంది. 2019లో అమెరికాతో దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలం అయినప్పటి నుంచి ఉత్తర కొరియా సైనిక అభివృద్ధిని రెట్టింపు చేసింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ గత సంవత్సరం తన దేశాన్ని “తిరుగులేని” అణుశక్తిగా ప్రకటించాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Japan
  • Kim Jong Un
  • North Korea
  • South Korea
  • Spy Satellite

తాజావార్తలు

  • Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!

  • Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి

  • M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్

  • Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!

  • Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions