North Korea: నార్త్ కొరియాలో కరోనా విలయతాండవం… 21 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి గుప్పిట చిక్కి చాలా నష్టపోయాయి. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా పలు దేశాలు కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తోంది కరోనా. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి డెవలప్ దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడాయి. ఏకంగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటిందంటే… అమెరికాపై కరోనా ఏ విధంగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నార్త్ కొరియా కరోనా ఒమిక్రాన్ తో అల్లాడుతోంది. ఆ దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అవ్వడంతో… దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుంచి అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కిమ్ అన్నారు. కొవిడ్ -19 వ్యాప్తిని ‘ గొప్ప విపత్తు’గా పోల్చాడు. కోవిడ్ చర్యలపై కిమ్ పార్టీ పోలిట్ బ్యూరోతో సమావేశం అయ్యాడు. దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని ఆర్మీని ఆదేశించారు.
Also Read
- Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
నార్త్ కొరియాలో కరోనా మరణాలు, కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా 21 మంది కరోనా బారిన పడి మరణించారు. శనివారం వరకు మొత్తం 27 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఒక్క శుక్రవారంమే దేశంలో 1,74,440 కరోనా సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 5,24,440 మంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది. 2,80,810 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు ఉత్తర కొరియా అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
-
Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
-
Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
ట్రెండింగ్
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..