Nigerian chef: వంట చేయడంలో 2, 3 గంటలపాటు ఉండాలంటేనే ఎంతో ఓపిక అవసరం ఉంటుంది. అలాంటి ఒక రోజు రెండు రోజులు కాదే ఏకంగా 4 రోజుల పాటే ఏకధాటిగా వంటలు చేస్తూనే ఉంటే.. వాళ్లకెంత ఓపిక ఉండాలో అనుకుంటున్నారా? నిజమే ఏకధాటిగా 4 రోజుల పాటు వంటలు చేస్తూ ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. 4 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా వంటలు చేసిన ఒక మహిళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తిరగరాశారు. భారతీయ మహిళ పేరుతో ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డును నైజీరియన్ చెఫ్ తిరగరాసింది. నైజీరియన్ చెఫ్ ఏకధాటిగా 93 గంటల 11 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా వంట చేసి ఈ ఘనతను సాధించింది.
Read also: Kabali Producer KP Chowdary: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ‘కబాలి’ నిర్మాత అరెస్ట్
నైజీరియాకు చెందిన 26 సంవత్సరాల హిల్డా బాసి ఈ రికార్డును సాధించడానికి నిలబడి ఉండటానికి జిమ్‌లో శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు. గత నెలలో రికార్డును బద్దలు కొట్టడానికి అవసరమైన శిక్షణను జిమ్‌లో నాలుగు రోజులపాటు తీసుకున్నట్టు హిల్డా బాసి తెలిపారు. ఆమె మే 11-15 వరకు శిక్షణ పొందినట్టు చెప్పారు. నైజీరియన్ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని తాను కోరుకుంటున్నానని.. ఒక అమెరికన్ ఇంటిలో ఎగుసీ సూప్ చేయడం సాధారణ విషయంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తన రికార్డు ముగిసిన అనంతరం బాసి పాత్రికేయులతో అన్నారు. నైజీరియన్లు అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత మరియు ఇతర ఆర్థిక పోరాటాలతో పోరాడుతున్న సమయంలో బాసి వరల్డ్ రికార్డ్ కోసం చేసిన ప్రయత్నం దేశం దృష్టిని ఆకర్షించింది. వరల్డ్ రికార్డు కోసం ఆమె వంట చేస్తున్న సమయంలో లాగోస్ రాష్ట్ర గవర్నర్, ఆ దేశ ఉపాధ్యక్షుడు మరియు నైజీరియన్ ఆఫ్రోబీట్స్ మ్యూజిక్ స్టార్ తివా సావేజ్‌తో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులు బాసిని సందర్శించి వెళ్లారు. అయితే ఇది బాసీకి మొదటి విజయం కాదని ఆమె గతంలోనే ఒకసారి ఒక టెలివిజన్ వారు నిర్వహించిన వంటల పోటీలో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించి ప్రాంతీయ కుక్-ఆఫ్ పోటీలో స్పైసీ జొలాఫ్ రైస్‌ను తయారు చేసి పోటీలో గెలుపొందింది.
Read also: Priyamani Latest Pics: పింక్ డ్రెస్‌లో ప్రియమణి.. టాప్ టూ బాటమ్ అందాల ప్రదర్శన! పిక్స్ వైరల్
అన్ని సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు దీనిని నిర్ధారిస్తుందని ప్రకటించింది. హిల్డా బాసీ ఇప్పుడు అధికారికంగా ఎక్కువ సేపు వంట చేసిన చెఫ్‌గా గతంలో ఉన్న రికార్డును బద్దలు కొట్టిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. 2019లో ఒక భారతీయ చెఫ్ నెలకొల్పిన 87 గంటల 45 నిమిషాల రికార్డును హిల్డా బాసి బద్దలు కొట్టినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్పష్టం చేసింది.