Epstein photos: మరో సంచలనం.. ఎప్స్టీన్తో ఉన్న ప్రముఖుల ఫొటోలు విడుదల
- అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం
- ఎప్స్టీన్తో ఉన్న ప్రముఖుల ఫొటోలు విడుదల
- ఫొటోల్లో హై ప్రొఫైల్ వివరాలు, పాస్‌పోర్టులు, పత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ నుంచి మరిన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఎప్స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై ఇటీవలే సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే హౌస్ డెమొక్రాట్లు జెఫ్రీ జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ నుంచి 68 ఫొటోలను విడుదల చేశారు. ఈ ఫొటోల్లో అత్యంత పేరుగాంచిన ప్రముఖులు ఉండడం విశేషం. ఫొటోల్లో హై ప్రొఫైల్ వివరాలు, పాస్‌పోర్టులు, పత్రాలు ఉన్నాయి. ఇక శుక్రవారం నాటికి పూర్తి ఫైల్స్‌ను న్యాయశాఖ విడుదల చేయనుంది.

Also Read
గురువారం యూఎస్ హౌస్ డెమొక్రాట్లు జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ నుంచి 68 ఫొటోలు విడుదల చేశారు. ఇందులో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపించాయి. తాజా ఫొటోల విడుదలతో న్యాయశాఖపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇక తాజా ఫొటల్లో హై-ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా బిల్ గేట్స్, నోమ్ చోమ్స్కీ, స్టీవ్ బానన్, వుడీ అల్లెన్లు కనిపించారు. కొన్ని చిత్రాల్లో అస్పష్టమైన ముఖం కలిగిన ఒక మహిళ పక్కన బిల్స్ గేట్స్ నిలబడి ఉన్నారు.
పత్రాలు, వ్యక్తిగత రికార్డులు:
తాజా చిత్రాల్లో అనేక పత్రాలు, రికార్డులు కనిపించాయి. రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా, దక్షిణాఫ్రికా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల నుంచి పాస్‌పోర్ట్‌లు, వీసాలు, గుర్తింపు కార్డులు, సున్నితమైన వివరాలు కనిపించాయి. ఇక అనేక పత్రాల్లో ‘స్త్రీ’ అని రాయబడి ఉంది.
ఇతర అంశాలు
‘‘యువతులకు సంబంధించిన టెక్ట్స్ సందేశాల స్క్రీన్షాట్లు కనిపించాయి. ఒక స్నేహితురాలు కొంత మంది అమ్మాయిలను పంపించింది. ఒక్కొక్క అమ్మాయి నగదు అడుగుతోంది.’’ అని రాసి ఉంది.

అయితే ఫోటోల్లో కనిపించినంతమాత్రాన తప్పు చేసినట్లు అర్థం కాదని హౌస్ డెమొక్రాట్లు తెలిపారు. ఎప్స్టీన్తో కలిసి నేరం చేసినట్లు కాదని పేర్కొన్నారు. ఇక బాధితుల గోప్యతను కాపాడటానికి పర్యవేక్షణ కమిటీ జాగ్రత్తలు పాటించింది. మహిళలు, బాలికల ముఖాలను దాచిపెట్టారు. బాధితులను కాపాడుతూ.. ప్రజలకు పారదర్శకతను అందించడానికే ఫొటోలు విడుదల చేసినట్లుగా హౌస్ డెమొక్రాట్లు పేర్కొన్నారు.
జులై 2019లో ఎప్స్టీన్పై సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు మోపారు. అయితే అతను విచారణకు రాకముందే మాన్హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో.. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!