NASA Artemis 1 Launch: రేపే ఆర్టెమిస్-1 ప్రయోగం.. సిద్ధం చేసిన నాసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA Artemis 1 Launch: చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం సెప్టెంబర్ 3వ తేదీన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. సోమవారమే జరగాల్సిన ఈ ప్రయోగం ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సమస్యలను సరిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. నాసా ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత శక్తిమంతమైన రాకెట్ ఇదే కావడం విశేషం. శనివారం ప్రయోగానికి అనువైన వాతావరణం ఉండే అవకాశాలు 40 శాతం వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో దాదాపు 322 అడుగుల పొడవున్న ఈ భారీ రాకెట్‌ను కెన్నెడీ స్పేస్ సెంటర్లోనే ఉంచారు. ప్రారంభించిన మొదటి ప్రయోగాన్ని ఇంజిన్ ఇబ్బందులతో నిలిపివేసిన తర్వాత నాసా శనివారం తన శక్తివంతమైన తదుపరి తరం చంద్ర రాకెట్‌ను ప్రయోగించడానికి రెండవ ప్రయత్నం చేస్తోంది.
ఏదేమైనా వాతావరణ సూచన శనివారం నాడు అనుకూలమైన ప్రయోగ పరిస్థితులకు కేవలం 40శాతం అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మొదటి ప్రయోగాన్ని ప్రభావితం చేసిన అదే సమస్యలు మళ్లీ కనిపించడానికి ఇప్పటికీ అవకాశం ఉందని నాసా అంగీకరించింది. అన్ని సానుకూలంగా జరిగితే శనివారం మధ్యాహ్నం 2.17 నిమిషాలకు ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈ సారి మానవరహిత ఓరియన్ స్పేస్ క్యాప్సుల్‌ను రాకెట్‌తో పాటు అంతరిక్షంలోకి పంపనున్నారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
Bihar: చెవి నొప్పి ఉందని ఆసుపత్రికి వెళ్తే.. చేయి కోల్పోయింది..
50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. సోమవారం ప్రయోగానికి మొత్తం సిద్ధం చేశాక.. ప్రధాన ఇంజిన్లు పనిచేయడానికి అవసరమైన ప్రీలాంఛ్ ఉష్ణోగ్రతను అందుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. దీనిపై నాసా ఆర్టెమిస్ లాంఛ్ డైరెక్టర్ ఛార్లీ బ్లాక్వెల్ థాంప్సన్ మాట్లాడుతూ ఈ సారి ఇంజిన్ల కూలింగ్ ప్రక్రియ లాంఛ్ కౌంట్‌డౌన్‌కు 30 నిమిషాల ముందే మొదలు పెడతామని పేర్కొన్నారు. చంద్రుడిపై మనిషి కాలుపెట్టి అర్ధశతాబ్దం దాటింది. తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్‌కు ఈ ఏడాది డిసెంబర్లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి మూన్ మిషన్‌కు ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని నాసా పేరు పెట్టింది. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది. చంద్రుడి మీదకు నాసా సిద్ధం చేసిన ఆర్టెమిస్-1ను శనివారం ప్రయోగించనున్నారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!