Narendra Modi : మోదీ స్టే చేసే హోటల్ కు ఒక్క నైట్ కు ఎంత చెల్లిస్తారో తెలిస్తే షాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దూర ప్రాంతాలకు ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్లినప్పుడు అక్కడ మనకి ఎవరూ తెలియనివారు లేకపోతే బయట హోటల్లో స్టే చేయాల్సిన పరిస్థితి వస్తుంది.. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు తో హోటల్స్ ఉంటాయి.. కొన్ని హోటల్స్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నా బిల్లు చూస్తే తడిసి మోపడి అవుతుంది.. ఒక హోటల్లో ఒక నైట్ బస చేయాలంటే వేలల్లో ఖర్చవుతుంది. అదే లగ్జరీ హోటల్స్‌లో ధరలు లక్షల్లోనే వుంటాయని మీకు ఐడియా వుందా.. ఒక్కరోజు అక్కడ గడపడానికి చేసే ఖర్చుతో ఏకంగా ఒక మంచి కారు కొనుగోలు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది నిజం…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బస చేసిన ఓ హోటల్ సింగిల్ నైట్‌కే ఏకంగా రూ.12.15 లక్షలు ఛార్జ్ చేసిందనే విషయం మీకు తెలుసా? ఇక ఆ హోటల్ పేరు లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ మిడ్‌టౌన్.. ఈ ఫ్యాన్సీ హోటల్ మాన్‌హట్టన్‌లో ఉంటుంది. ఇది 1880ల కాలం నుంచే ఉంది.. రోమన్ చక్రవర్తిలా జీవించాలనుకున్న ధనవంతుడు హెన్రీ విల్లార్డ్ ఈ ప్రైవేట్ ఇల్లును నిర్మించుకున్నారట. ఇతను ఉత్తర పసిఫిక్ రైల్వే అధ్యక్షుడు, రైల్వే ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతలు గాంచాడు. అయితే ఆయన తరువాత 1980వ దశకంలో దీనిని లియోనా హెల్మ్‌స్లీ అనే మహిళ కొనుగోలు చేశారు. తరువాత ఆమె దానిని చాలా అక్రమంగా నడిపారని చరిత్ర చెబుతోంది..
Also Read
ప్రముఖులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ వంటి చాలామంది దేశాధినేతలు బస చేసిన ఘనత ఆ హోటల్ కి వుంది. లోట్టే న్యూయార్క్ ప్యాలెస్‌ను CW టెలివిజన్ షో అయిన గాసిప్ గర్ల్‌కు సెట్టింగ్‌గా ఉపయోగించారు. షోలోని పాపులర్ క్యారెక్టర్ అయిన సెరెనా వాన్ డెర్ వుడ్‌సెన్ హోటల్ టవర్స్ పెంట్‌హౌస్ సూట్లో స్టే చేశారు.కాగా ఈ షో మిలీనియల్స్ 1981-1996 మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. అందులో అనేక సన్నివేశాలలో హోటల్ ఆనందాన్ని మనం చూడవచ్చు. ఈ షో న్యూయార్క్ నగరంలోని సంపన్న యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి పార్టీలు, హుక్అప్లు, ఇతర డ్రామాలకు నేపథ్యంగా హోటల్‌ను ఉపయోగించారు.. దాంతో ఈ హోటల్ బాగా ఫెమస్ అయ్యిందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
-
Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
-
Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!