Myanmar executes 4 democracy activists: మయన్మార్ లోని జుంటా ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది. నలుగురు రాజకీయ, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను ఉరితీసింది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం విమర్శలు ఎదర్కొంటోంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి 2020 ఫిబ్రవరిలో సైనికపాలన తీసుకువచ్చింది అక్కడి సైన్యం.