ప్రధాని మోడీ ఇటలీ టూర్ ఖరారు.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29 నుంచి నవంబరు 2 వరకు ఇటలీ, బ్రిటన్లలో పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్‌లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
ఇటలీ పర్యటన తర్వాత మోడీ.. గ్లాస్‌గౌలో జరిగే కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్‌కు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్.. మోదీని ఆహ్వానించారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ‘ప్రపంచ నేతల సదస్సు’ నవంబరు 1-2 మధ్య జరగనుంది. ఇందులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి. 120పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ఇదిలా వుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న ఎనిమిదో జీ-20 సదస్సు ఇది. అంతేకాదు.. భారత్ తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో మోదీ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటనలో విడుదల చేసింది.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!