NewYork: మీ ఫ్రెండ్స్ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ల బాస్‌కు అవే అబద్ధాలు చెబుతున్నారా? అయితే వారి గురించి మీరు తప్పకుండా ఆలోచించాల్సిందే. వారు చేసే ఈ పనుల నేపథ్యంలో వారి గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు వారు ఏ ఇయర్‌లో పుట్టారో ముందు తెలుసుకోండి.. దాన్ని బట్టి వారేంటో తెలుస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. పుట్టిన సంవత్సరానికి.. వారు చేసే పనులకు సంబంధం ఏమిటనీ ఆశ్చర్య పోతున్నారా? కొందరు పుట్టిన సంవత్సరంను బట్టి వారు ఎక్కువగా అబద్దాలు చెప్పే అలవాటు ఆటోమేటిక్‌గా వస్తుందంట.. ఈ మధ్య అమెరికాలో చేసిన సర్వే ద్వారా ఈ విషయం బయట పడింది. ఏ సంవత్సరంలో పుట్టిన వారు ఎక్కువగా అబద్దాలు ఆడతారో తెలుసుకుందాం..
Read also: Husband killed wife: భూతవైద్యం కోసం తీసుకొచ్చి.. భార్యను చెరువులో ముంచి చంపిన భర్త
ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి బాస్‌కు అవే అబద్ధాలు చెబుతున్నారా? అయితే వారు 1981-1996 మధ్య జన్మించి ఉంటారు!. ఈ కాలంలో జన్మించిన వారిని మిలీనియల్స్‌గా పిలిస్తారంటా. ఈ ఏజ్ గ్రూప్ వారు అందరి కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్లేస్టార్ సంస్థ దీనిపై సర్వే చేసింది. కొలరాడో, ఇల్లీనాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సీల్వేనియా, టెన్నెసీ, విస్కాన్సిన్ తదితర రాష్ర్టాల్లోని 1306 మందిని ఈ సంస్థ సర్వే చేసింది. ఎక్కువగా అబద్ధాలు చెప్పే ఈ ఏజ్ గ్రూప్‌కు చెందిన వారు ఈ సర్వేలో నిజాలను వెల్లడించారు. ఈ సర్వేకు సంబంధించిన వివరాలతో న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. రోజుకు కనీసం ఒక్క అబద్ధమైనా చెబుతామని 13 శాతం మంది మిలీనియల్స్ అంగీకరించారు. తమ రెజ్యూమ్‌లను ఫాబ్రికేట్ చేశామని మూడింట ఒక వంతు మంది ఒప్పుకొన్నారు. ప్రతి ఐదుగురు మిలీనియల్స్‌లో ఇద్దరు పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకొనేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతున్నట్టు సర్వేలో తేలింది. సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పించేందుకు తాము అబద్ధాలు చెబుతున్నట్టు నాలుగింట ఒక వంతు మంది తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలతో పోలిస్తే పురుషులు 10 శాతం ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారని సర్వేలో తేలింది.
Read also: Ujjaini Bonalu: ఘనంగా మహంకాళి బోనాలు.. అమ్మవారికి బోనం సమర్పించిన తలసాని
ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నట్టు 58 శాతం మంది తెలపగా, గోప్యత, ఇతరులు మందలించకుండా తప్పించుకునేందుకు చెబుతున్నట్టు 42 శాతం మంది పేర్కొన్నారు. అదే సమయంలో రోజుకు ఒక అబద్ధమైనా చెబుతామని 2 శాతం మంది బేబీ బూమర్స్ (1946-1964 మధ్య జన్మించినవారు) తెలిపారు. జెన్ జెడ్ (1997-2021), జెన్ ఎక్స్ (1965-1980)ల మధ్య సారూప్యత కనిపించింది. రోజూ అబద్ధం చెబుతామని ఈ గ్రూపులకు చెందిన 5 శాతం మంది మాత్రమే తెలిపారు.