ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించాల్సిన ఆర్థిక ప్రగతి, కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మాస్టర్ కార్డు కేంద్రం ద్వారా సాధిస్తున్న ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై ఆయా రంగ ప్రముఖులతో శుక్రవారం ప్రధానంగా చర్చించారు.
భారతదేశం, బంగ్లాదేశ్ ICC T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ కు ముందు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను సందర్శించిన తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. స్టేడియం లోని స్టాండ్‌ల, సెంటర్ స్క్వేర్ వైపు చూస్తూ.. రిలాక్స్‌డ్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ నిర్వహులకు సెల్యూట్ చేశాడు. ఈ సందర్బంగా.. “ఇది చాలా అందంగా ఉంది. ఇది చాలా ఓపెన్ గ్రౌండ్. మేము…
సహాయక సిబ్బందితో పాటు ఎక్కువ మంది భారత ఆటగాళ్ళు మే 25 న న్యూయార్క్ కు బయలుదేరుతారు. మిగిలిన వారు మే 26 ఐపిఎల్ ఫైనల్ తర్వాత మాత్రమే టి 20 ప్రపంచ కప్కు బయలుదేరుతారు. అంతకుముందు, ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన జట్ల సభ్యులు మే 21 న న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. మే 19 న ఐపిఎల్ చివరి లీగ్ ఆట జరిగిన రెండు రోజుల తరువాత, ప్రణాళికలలో కొంత మార్పు వచ్చిందని.,…
Floods in New York: ఇటీవల ప్రపంచ దేశాలన్నీ వరదలు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటీవల లిబియాలో సంభవించిన వరతల కారణంగా వేల మంది చనిపోయారు. మొరాకోలో వచ్చిన భూకంపం కారణంగా కూడా కొన్ని వందల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాది చివరిలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులన్నీ…
మీ ఫ్రెండ్స్ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ల బాస్‌కు అవే అబద్ధాలు చెబుతున్నారా? అయితే వారి గురించి మీరు తప్పకుండా ఆలోచించాల్సిందే.
31 ఏళ్ల గూగుల్ ఉద్యోగి న్యూయార్క్‌లోని చెల్సియాలో గల ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువారం చెల్సియాలోని గూగుల్ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది.
తడాది నవంబర్‌లో ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 26న చోటుచేసుకుంది.
31 Dead After Winter Storm In US: అమెరికాను మంచు తుఫాను అల్లాడిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలు మంచు తుఫాను ధాటికి ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటి వరకు మంచు తుఫాన్ వల్ల 31 మంది మరణించారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ నగరం అతలాకుతలం అవుతోంది. అత్యవసర సేవలపై హిమపాతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
Newyork: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ లో వలసల సంక్షోభం నెలకొంది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోకి అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో రావడంతో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు.
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కాల్పులు జరిపి ఏకంగా 10 మందిని హతమార్చాడు ఓ దుండగుడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు సైనిక తరహా దుస్తులు ధరించి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(…