Point Nemo: ‘పాయింట్ నిమో’ భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం. సమీప మానవుడిని చేరుకోవాలంటే ఇక్కడ నుంచి వేల కిలోమీటర్లు వెళ్లాల్సింది. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం నుంచి సమీపంలో ఉండే మానవులు ఎవరంటే.. భూమికి ఎగువన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర(ఐఎస్ఎస్)లో నివసించే వ్యోమగాములే. ఈ పాయింట్ నుంచి ఐఎస్ఎస్ 400 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది.