G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G2 Release Date: అడివి శేష్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య నెట్వర్క్ నేపథ్యంలో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీకి రిలీజ్ డేట్ ను చిత్ర బృందం లీక్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ‘G2’ థియేటర్లలోకి రాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. త్వరలోనే దీనిపై ఆఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ కి సీక్వెల్‌గా ‘G2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ హిట్ తో సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో, అంతర్జాతీయ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్ కూడా సినిమా స్కేల్‌ను చూపించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ చేయాలనుకున్నా మరింత క్వాలిటీ అవుట్ పుట్ కోసం మేకర్స్ వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ తో అడివి శేష్ అభిమానులకు, స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు ఊరట ఇచ్చినట్లయింది.
‘G2’ సినిమాకు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్టులు, భారీ యాక్షన్ సీక్వెన్సులతో కథను నడిపించనున్నట్లు తెలుస్తోంది. గూఢచారి ప్రపంచంలో జరిగే ఒక హై రిస్క్ మిషన్ చుట్టూ ఈ కథ సాగనున్నట్లు ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు చాలా టర్నింగ్ పాయింట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. అయితే అడివి శేష్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘G2’ అడివి శేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అంతర్జాతీయ లొకేషన్లు, భారీ యాక్షన్ బ్లాక్స్, గ్రాండ్ విజువల్స్ కోసం మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ఇతర కీలక నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. 2027 ఫిబ్రవరి 5న విడుదల కానున్నట్లు వస్తున్న వార్తలపై త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది. అదే జరిగితే సంక్రాంతి సినిమాల సందడి ముగిసిన వెంటనే థియేటర్లలో ‘G2’ స్పై మిషన్ మొదలుకానుంది.
Also Read
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Tags
- Adivi Sesh
- cinema
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..