Pakistan: పాక్‌లో టెన్షన్, టెన్షన్.. మెట్రో స్టేషన్‌కు నిప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొలిటికల్ డ్రామా మధ్య పాకిస్థాన్ ప్రధాని పదవి కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్.. అయితే, అవిశ్వాత తీర్మానం తర్వాత అధికారాన్ని కోల్పోయిన ఇమ్రాన్.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ర్యాలీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు.. ఈ సందర్భంగా పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.. ఆందోళనకారులను చెదరగట్టేందుకు పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, కొందరిని చెదరగొట్టారు.
Read Also: Samajika Nyaya Bheri: వైసీపీ `సామాజిక న్యాయ భేరి`
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- Pakistan: ఉద్రిక్తతల వేళ టర్కీ, సౌదీ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ఇక, పోలీసుల చర్యతో మరింత రెచ్చిపోయారు పీటీఐ పార్టీ శ్రేణులు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు.. చైనా చౌక్ మెట్రోస్టేషన్‌కు, అక్కడున్న చెట్లకు నిప్పుపెట్టారు.. ఇదే సమయంలో.. పీటీఐ పార్టీకి చెందిన ఓ వ్యక్తి మృతిచెందడం కలకలం రేపుతోంది.. ఫైసల్ అబ్బాస్ చౌదరి అనే వ్యక్తి వంతెనపై నుండి పడి మృతి చెందినట్ట పోలీసులు చెబుతుండగా.. అసలు పోలీసులే అతడిని వంతెనపై నుంచి తోసేశారని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా, ఏప్రిల్‌లో పాక్ ప్రధానమంత్రి పదవి నుండి తొలగించబడిన ఇమ్రాన్ ఖాన్, తాజా ఎన్నికలను డిమాండ్ చేయడానికి ఇస్లామాబాద్‌లోని డి-చౌక్‌లో ‘శాంతియుత’ నిరసన ర్యాలీ కోసం తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో నిరసన ర్యాలీని అనుమతించాలని పాకిస్తాన్ యొక్క సుప్రీం కోర్ట్ అధికారులను ఆదేశించిన తరువాత మరియు రాజకీయవేత్తగా మారిన క్రికెటర్‌ను అరెస్టు చేయకుండా వారిని నిరోధించిన తర్వాత అతని నిరసనకు పిలుపునిచ్చారు.. అయితే, ఆందోళనకారులు వేలాదిగా గుమిగూడి బారికేడ్లను తొలగించడంతో పోలీసులతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత విధ్వంసానికి పాల్పడ్డారు.
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!