పొలిటికల్ డ్రామా మధ్య పాకిస్థాన్ ప్రధాని పదవి కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్.. అయితే, అవిశ్వాత తీర్మానం తర్వాత అధికారాన్ని కోల్పోయిన ఇమ్రాన్.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ర్యాలీకి భారీ సంఖ‍్యలో తరలివచ్చారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు.. ఈ సందర్భంగా పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.. ఆందోళనకారులను చెదరగట్టేందుకు పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, కొందరిని చెదరగొట్టారు.…