గత కొద్దిరోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్-లెబనాన్-ఇరాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. గత అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా లెబనాన్‌లో వందలాది పేజర్ అనే కమ్యూనికేషన్ పరికరాలు హఠాత్తుగా పేలిపోయాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 3 వేలమందికి పైగా గాయాలు పాలయ్యారు. బాధితులను ఆస్పత్రులకు తరలించారు. పేలుడు ధాటికి భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: అమెరికా వెళ్లనున్న మోడీ.. క్వాడ్ సమావేశానికి హాజరు
గాజాతో యుద్ధం తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లాల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. దీంతో నివురుగప్పిన నిప్పులా పరిస్థితులు మారాయి. తాజాగా లెబనాన్‌లో వందలాది ‘పేజర్ (Pager)’ అనే కమ్యూనికేషన్ పరికరాలు పేలిపోయాయి. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయని లెబనాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.. నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు
చేత్తో పట్టుకునే పేజర్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేల్చేశారని లెబనాన్ ఆరోపించింది. అయితే హిజ్బుల్లా సభ్యులు వాడుతున్న పేజర్లే పేలిపోయాయని, వారే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారని, తమ సభ్యులు ఇందులో ఉన్నారని హిజ్బుల్లా వెల్లడించింది. లెబనాన్‌లోని ఇరాన్ రాయబారి సైతం గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Singer Mano Sons: మనో కూమారులు దాడి వెనుక కుట్ర.. బయటకు షాకింగ్ వీడియోలు
లెబనాన్‌లో ఇది అతి పెద్ద భద్రతా వైఫల్యం అని చెప్పొచ్చు. హిజ్బుల్లా ఉపయోగించే కమ్యూనికేషన్ పరికారం పేలిపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పవచ్చు. లెబనాన్ అంతటా అనేక మంది గాయపడ్డారు. రక్తస్రావంతో నేలపై పడుకున్న చిత్రాలు కనిపించాయి. దక్షిణ లెబనాన్‌లో దేశానికి తూర్పున మరియు బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతాల్లో ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయని హిజ్బుల్లా వెల్లడించింది.
🚨 Breaking: Tens of Hezbollah communication devices are exploding during the past hour. Initial reports state that over one hundred Hezbollah terrorists already injured.
Here's footage from two such explosion 👇 pic.twitter.com/rMwdRWsTGB
— Dr. Eli David (@DrEliDavid) September 17, 2024
BREAKING:
Hospitals filling up in Lebanon as hundreds of Hezbollah operatives had their pagers blown up simultaneously pic.twitter.com/Uow3KKlNdd
— Visegrád 24 (@visegrad24) September 17, 2024
Lebanon Pagers' Blast | 2750 have been wounded and 8 people have died in pagers' detonation across the country, reports Reuters, citing Lebanon Health Minister.
— ANI (@ANI) September 17, 2024