Marco Rubio-Iran: ‘‘మా కంటే వారికే ఎక్కువ నష్టం’’.. హార్ముజ్‌పై మార్కో రూబియో హెచ్చరిక
- తీవ్రమవుతోన్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు
- ‘‘మా కంటే వారికే ఎక్కువ నష్టం’’
- హార్ముజ్‌పై మార్కో రూబియో హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న తరుణంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లను నియంత్రించాలని ప్రయత్నం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని రూబియో వార్నింగ్ ఇచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. అంతర్జాతీయ జలాల్లో ఎవరు ప్రయాణించాలో ఇరాన్ నిర్ణయించే అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రూబియో తేల్చి చెప్పారు.
హార్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచంలో పెద్ద మొత్తంలో చమురు, సహజ వాయువు ఈ మార్గం గుండానే వెళ్తుంది. అయితే గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయడంతో అప్పటి నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తోంది. హార్ముజ్‌ను తన కంట్రోల్ పెట్టుకుంది. దీంతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి.. ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కో రూబియో ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Also Read
- Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
- Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
అమెరికాకు హార్ముజ్ జలసంధి మార్గంపై ఆధారపడే శాతం చాలా తక్కువ అని.. ఏదైనా జరిగితే ఇరాన్‌కే నష్టం అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ మార్గంపై ఆధారపడతాయని పేర్కొన్నారు.
ఇరాన్‌పై ప్రధాన లక్ష్యాలను రూబియో వెల్లడించారు.
1. ఇరాన్ వైమానిక దళాన్ని బలహీనపరచడం
2. నౌకాదళాన్ని ధ్వంసం చేయడం
3. క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని తగ్గించడం
4. రక్షణ పరిశ్రమలను దెబ్బతీయడం
ఈ లక్ష్యాలను కొన్ని వారాల్లోనే సాధించవచ్చని రూబియో పేర్కొన్నారు. అమెరికా ఎప్పుడూ సమస్యలను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని కోరుకుంటుందని తెలిపారు. అవసరమైతే సైనిక చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Iran-US: భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి
తాజావార్తలు
-
OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
-
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
-
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
-
Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?