Iran-US: భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి
- తీవ్రమవుతోన్న పశ్చిమాసియా యుద్ధం
- భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి
- విమానం ధ్వంసం అయినట్లు అధికారలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం యుద్ధం మరింత భయాందోళనలు కలిగిస్తోంది.
తాజాగా భారత సహాయం కోసం ఢిల్లీకి రావాల్సిన ఇరాన్ విమానంపై అమెరికా దాడి చేసింది. దీంతో మహాన్ ఎయిర్ విమానం దెబ్బతింది. ఇరాన్ ప్రజలకు అవసరమైన వైద్య, సహాయ సామగ్రిని తీసుకొచ్చేందుకు భారత్‌కు బయల్దేరాల్సిన విమానం ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయంలో నిలిచి ఉంది. అయితే అమెరికా జరిపిన వైమానిక దాడితో విమానం ధ్వంసం అయింది. దీంతో మానవతా సహాయానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అయితే ఈ వార్తను అమెరికా అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
మషద్ విమానాశ్రయం ఇరాన్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లోని మషద్‌లో ఉన్న ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం పౌర, సైనిక ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మషద్ విమానాశ్రయంపై అమెరికా దాడి తర్వాత విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్.. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ విమానం ఏప్రిల్ 1న ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా భారతదేశం మార్చి 18న ఇరాన్‌కు మొదటి విడత వైద్య సామాగ్రిని పంపింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సహాయానికి భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. అప్పటి నుంచి అనేక నగరాల్లోని ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రజలు నిధులు, సహాయక సామగ్రిని విరాళంగా ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!