Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిర్వహించిన ప్రత్యేక ‘కెప్టెన్ కంపారిజన్ ఛాలెంజ్’లో పాల్గొన్న ఫించ్.. డాన్ బ్రాడ్‌మన్, రిచీ బెనాడ్, ఇయాన్ చాపెల్, మార్క్ టేలర్, మైఖేల్ క్లార్క్, రికీ పాంటింగ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ వంటి దిగ్గజ కెప్టెన్లను ఒక్కొక్కరితో పోల్చుతూ తన ఎంపికను వెల్లడించాడు.
మొదట డాన్ బ్రాడ్‌మన్, రిచీ బెనాడ్లలో ఒకరిని ఎంచుకోవాల్సి రాగా.. రిచీ బెనాడ్కే ఆరోన్ ఫించ్ ఓటు వేశాడు. అనంతరం బెనాడ్, ఇయాన్ చాపెల్లలో చాపెల్‌ను ఎంపిక చేశాడు. ఇయాన్ చాపెల్‌ను అతని సోదరుడు గ్రెగ్ చాపెల్‌తో పోల్చినా.. మళ్లీ ఇయాన్ చాపెల్కే ఫించ్ మద్దతు తెలిపాడు. ఆ తర్వాత మార్క్ టేలర్‌ను ఇయాన్ చాపెల్ కంటే మెరుగైన కెప్టెన్‌గా పేర్కొన్నాడు. మార్క్ టేలర్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోల్చినప్పుడు కూడా టేలర్‌కే ఫించ్ ఓటేశాడు.
Also Read
- Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
- Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ఆ తర్వాత మార్క్ టేలర్, మైఖేల్ క్లార్క్‌ల మధ్య ఎంపికలో ఆరోన్ ఫించ్ తన మాజీ కెప్టెన్ క్లార్క్‌కు మద్దతు ఇచ్చాడు. 2015 వన్డే ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియాకు అందించిన క్లార్క్.. జట్టును క్లిష్ట పరిస్థితుల్లో విజయవంతంగా నడిపించాడని ప్రశంసించాడు. మిచెల్ మార్ష్, షేన్ వాట్సన్, టిమ్ పెయిన్, తనతో పోల్చినా.. క్లార్క్నే మెరుగైన కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అయితే మైఖేల్ క్లార్క్, రికీ పాంటింగ్‌ల మధ్య పోలిక వచ్చినప్పుడు మాత్రం ఫించ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరుసగా 2003, 2007 వన్డే ప్రపంచ కప్‌లను గెలిపించి ఆస్ట్రేలియాను ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానంలో నిలబెట్టిన పాంటింగ్‌కే ఓటు వేశాడు.
కానీ రికీ పాంటింగ్‌ను అలన్ బోర్డర్‌తో పోల్చినప్పుడు.. క్లిష్ట సమయంలో జట్టును పునర్నిర్మించి విజయపథంలో నడిపించిన బోర్డర్‌ను ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు. స్టీవ్ స్మిత్, జార్జ్ బేలీ, పాట్ కమిన్స్‌ల కంటే కూడా అలన్ బోర్డర్ గొప్ప కెప్టెన్ అని పేర్కొన్నాడు. చివరగా అలన్ బోర్డర్, స్టీవ్ వా మధ్య తుది ఎంపికలో స్టీవ్ వానే ఎంచుకున్నాడు. చిన్నతనంలో తనపై స్టీవ్ వా ఎంతో ప్రభావం చూపించాడని, అతని నాయకత్వంలో ఆస్ట్రేలియా స్వర్ణయుగాన్ని ఆస్వాదించిందని చెప్పాడు. 1999 ప్రపంచ కప్‌ను గెలిపించడమే కాకుండా టెస్టు క్రికెట్లో వరుసగా 16 విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్టీవ్ వానే ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ అని ఫించ్ అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!