జపాన్ తూర్పు నోడా ప్రాంతం తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 19.3 కి.మీ లోతులో సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఇటీవల 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అనేక ప్రాంతాలను కుదిపేసింది. అప్పుడు 30 మంది గాయపడ్డారు. 90,000 మంది నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు 6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇది కూడా చదవండి: Off The Record : కుల బలంతో కావాల్సిన పనులు చేయించుకుంటున్న ఎమ్మెల్యే?
ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. కనీసం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి భూకంపం సంభవిస్తుంది. పసిఫిక్ బేసిన్‌ను పాక్షికంగా చుట్టుముట్టిన అగ్నిపర్వతాలు, సముద్ర కందకాల కారణంగా సంభవిస్తూ ఉంటాయి. ప్రపంచంలో 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో దాదాపు 20 శాతం సంభవిస్తూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: Off The Record : మంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ మధ్య విబేధాలు..?