Lufthansa Tells Passengers To Delete Videos, Pics After Severe Turbulence: ఇటీవల లుఫ్తాన్సాకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. సాంకేతిక సమస్య ఏర్పడటంతో.. 37 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఆ విమానం ఒక్కసారిగా 4 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఈ క్రమంలో భారీ కుదుపులు ఏర్పడటంతో.. క్యాబిన్‌లో ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురయ్యాయి. గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనతో.. విమానంలో ఉన్న ప్రయాణికులు దాదాపు తమ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు. అయితే.. పైలట్లు అంత సులువుగా ఓటమిని అంగీకరించలేదు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. అత్యవసరంగా వాషింగ్టన్ డీసీలోని డ్యులెస్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను సురక్షితంగా బయటపడేశారు. కాకపోతే.. భారీ కుదుపుల కారణంగా ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.
LPG Gas Cylinder: ప్రజలకు సర్కార్ బంపరాఫర్.. గ్యాస్ ధరపై రూ.300 తగ్గింపు
మార్చి 1న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. విమానంలో కుదుపులు ఏర్పడినప్పుడు, లోపలున్న ప్రయాణికుల్లో కొందరు ఆ దృశ్యాలను తమ ఫోన్‌లో ఫోటోలు, వీడియోల రూపంలో బంధించారు. ఈ ఘటన తాలూకు వివరాలు బయటపడితే తమ ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఉద్దేశంతో.. ఫోటోలను, వీడియోలను తొలగించాల్సిందిగా ప్రయాణికులకు సిబ్బంది కోరింది. కానీ.. ప్రయాణికులు అందుకు అంగీకరించలేదు. వాళ్లు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వెంటనే వైరల్ అయ్యాయి. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలేంటో లుఫ్తాన్సా ఎయిర్‌లెన్స్ ఇప్పటివరకూ వెల్లడించలేదు. మార్చి 1వ తేదీన లుప్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన A330-300 విమానం.. టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు పయనమైనప్పుడు, ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ చేయడం ద్వారా.. పెద్ద ప్రమాదం నుంచి అందరూ తప్పించుకోగలిగారు.
Teacher Obscene Videos: కీచక టీచర్.. విద్యార్థినులకు బూతు వీడియోలు చూపించి..
ఈ ఘటన గురించి ఒక ప్యాసింజర్ స్పందిస్తూ.. విమానం అనుకోకుండా ఒక్కసారిగా 37 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు డ్రాప్ అయ్యిందని, ఈ క్రమంలో ఆహారా పదార్థాలతో పాటు కొన్ని పర్సనల్ ఐటెమ్స్ క్యాబిన్‌లో చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపాడు. గాయపడిన వారిలో ఒకరైన ఓ మహిళ.. తాము దాదాపు చనిపోతామని అనుకున్నామని తెలిపింది. మరో ప్యాసింజర్ మాట్లాడుతూ.. తమను ఫోటోలు డిలీట్ చేయాల్సింది ఆదేశించారని, కానీ ఆలోపే కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిపాడు. ఈ ఘటన సమయంలో అందరూ కాసేపు గాల్లోనే తేలారంటూ మరొకరు తమ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Amit Shah: ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక రోజు.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అమిత్ షా శుభాకాంక్షలు