Puducherry CM Rangaswamy Announces 300 Subsidy On LPG Gas Cylinder: మన దేశంలో గ్యాస్ ధరలు ఎలా ఆకాశాన్నంటుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు రూ.450 మాత్రమే ఉన్న గ్యాస్ ధర.. ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటేసింది. ఇంకా పెరుగుతూ వస్తోందే తప్ప.. తగ్గే ఊసే ఎత్తడం లేదు. ఏదో ఒక రోజు గ్యాస్ ధరలు కిందకు దిగిరాకపోతాయా? అని ఆశలు పెట్టుకున్న ప్రతీసారి.. ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. దీంతో సాధారణ ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. సర్కార్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. పదో పరకో కాదు.. ఏకంగా రూ.300 సబ్సిడీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ ప్రకటన ఇచ్చింది కేంద్ర సర్కారో, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలో కావు.. పుదుచ్చేరి ప్రభుత్వం.
Teacher Obscene Videos: కీచక టీచర్.. విద్యార్థినులకు బూతు వీడియోలు చూపించి..
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీని అందిస్తున్నట్లుగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 126 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి కోట్ల 11,600 పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల విజయాలను వివరించిన రంగస్వామి.. నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి రూ.126 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లుగా తెలిపారు. కుటుంబ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ ఎల్‌పీజీ సబ్సిడీ కార్యక్రమం ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అలాగే.. వివిధ దేశాలకు చెందిన తమిళ పండితుల భాగస్వామ్యంతో ‘ప్రపంచ తమిళ సదస్సు’ను నిర్వహిస్తామని చెప్పారు.
Amit Shah: ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక రోజు.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అమిత్ షా శుభాకాంక్షలు