Pakistan: రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. నిజానికి టెర్రరిస్టుల్ని చూస్తే ప్రజలు భయపడాలి కానీ, పాకిస్తాన్‌లో మాత్రం బయటకు వెళ్లాలంటే ఉగ్రవాదులు భయపడి చస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్చి చంపుతారో తెలియడం లేదు. గత కొన్నేళ్లుగా ఒకే విధంగా ఉగ్రవాదుల్ని అజ్ఞాత వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు.