బ్రిటన్ రాజకుటుంబంలో భారీ కుదుపు జరిగింది. అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం రాజకుటుంబంలో రక్తసంబంధానికి చీలిక తెచ్చింది.. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా ఉంది.
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియాకు చెందిన గియుఫ్రే(41) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు.
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. సెక్స్ కుంభకోణం ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తూ 2019లో ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్, జెట్-సెట్టింగ్ ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను యూఎస్‌లోని ఓ కోర్టు బుధవారం విడుదల చేసింది.జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాలలో అమెరికాకు చెందిన చాలా మంది పెద్ద వ్యక్తుల పేర్లు కనిపించాయి.