North Korea: టెర్రర్ గ్రూపులకు నార్త్ కొరియా ఆయుధాలు.. విక్రయించేందుకు కిమ్ ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేవలం మధ్యప్రాచ్యానికే కాకుండా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇజ్రాయిల్‌కి మద్దతుగా యూరప్, అమెరికా దేశాలు నిలిస్తే, పాలస్తీనాకు మద్దతుగా అరబ్ ప్రపంచం నిలబడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ పై ఒక్క హమాస్ కాకుండా లెబనాన్ నుంచి హిజ్బుల్లా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు, రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్యప్రాచ్యంలోని టెర్రర్ గ్రూపులకు ఆయుధాలు విక్రయించే అవకాశం ఉందని దక్షిణ కొరియా గూఢచార సంస్థ తెలిపింది. అణుకార్యక్రమాల కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, గతంలో హమాస్ ఉగ్రసంస్థకు యాంటీ ట్యాంక్ రాకెట్ లాంచర్ విక్రయించిందని, దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు తెలిపారు. గాజాలో యుద్ధం మధ్య ఉత్తరకొరియా మరిన్ని ఆయుధాలు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. యుద్ధం నుంచి ప్రయోజన పొందేందుకు కిమ్ జోంగ్ ఉన్ పాలస్తీనాకు విస్తృత మద్దతు ప్రకటించారని దక్షిణ కొరియా ఇంటలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ కిమ్ క్యూ హ్యూన్ చట్టసభ సభ్యులకు వెల్లడించారు.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
Read Also: Relationship: క్లాస్‌మేట్‌తో 14 ఏళ్ల బాలిక రిలేషన్షిప్.. తండ్రి ఏం చేశాడంటే..?
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేసింది. హమాస్ ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్ ఉపయోగించిందని, ఇది సాధారణంగా భుజంపై పెట్టుకుని కాల్చేయవచ్చని, సాయుధ వాహనాలను ధ్వంసం చేసేందుకు ఉపయోగిస్తారని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణల్ని నార్త్ కొరియా ఖండించింది, ఇది అమెరికా నిరాధారమైన పుకార్లుగా పేర్కొంది.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. 1400 మందిని చంపేశారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరుల్ని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. దీని తర్వాత గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల 8500 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో కొందరు ఉగ్రవాదులు ఉండగా, చాలా మంది సాధారణ ప్రజలే ఉన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!