ప్రతీ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భూమిపై పెరుగుతున్న జనాభా అవసరాలు, జనాభా పెరుగుదల వచ్చే సమస్యలు, పర్యావరణంపై ప్రభావం ఇలా ప్రతీ అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో భూమి మీద జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా జనాభా దినోత్సవాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతోంది. ప్రస్తుతం భూమిపై అన్ని దేశాల్లో కలిపి…