Johnny Depp: కోర్టు సంచలన తీర్పు.. భార్యపై పరువునష్టం దావా గెలిచిన హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మాజీ దంపతులు జానీ డెప్ – అంబర్ హెర్డ్ల పరువునష్టం దావా కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఆరు వారాలపాటు సాగిన ఈ కేసు విచారణలో జానీ డెప్‌కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అంబర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని తేల్చింది. దీంతో, జానీ పరువుకు భంగం కలిగించినందుకు అతనికి 15 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా హెర్డ్‌కు ఆదేశించింది. అదే సమయంలో హెర్డ్‌కు 2 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సింది కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు అనంతరం బోరున విలపించిన అంబర్.. తన పరపతితోనే మాజీ భర్త జానీ ఈ కేసు గెలిచాడని అంబర్ ఆరోపణలు చేసింది.
ఇదిలావుండగా.. 2015లో వివాహ బంధంతో ఒక్కటైన జానీ, అంబర్ ఏడాదికే దూరమయ్యారు. 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే.. 2018లో అంబర్ వాషింగ్టన్ పోస్ట్‌కు ఓ వ్యాసం రాసింది. అందులో జానీ డెప్ ప్రస్తావించకుండా.. ఓ సెలెబ్రిటీ అయినప్పటికీ తనకూ గృహ హింస తప్పలేదని పేర్కొంది. అది జానీ ఇమేజ్‌ని దెబ్బతీసింది. ఆ వ్యాసంలో అతని పేరు లేకపోయినా.. తన భార్యని జానీ వేధించాడన్న చర్చలు జోరుగా సాగాయి. దీంతో.. అతడు కోర్టుకెక్కాడు. హెర్డ్ రాసిన ఆర్టికల్ కారణంగా తన కెరీర్ దెబ్బతిందని పేర్కొంటూ.. 50 మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశాడు. అందుకు కౌంటర్‌గా అంబర్ కూడా 100 మిలియన్ డాలర్ల దావా వేసింది.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఈ విధంగా జానీ, అంబర్ వేసిన పిటిషన్లపై ఫెయిర్‌ఫాక్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో న్యాయస్థానానికి హాజరైన ఈ ఇద్దరూ.. జ్యూరి ఎదుటే వాదులాడుకున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి.. అంబర్ చేసిన ఆరోపణలు అవాస్తమని గుర్తించిన జ్యూరీ, జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతని పరువుకు నష్టం కలిగించినందుకు 10 మిలియన్ డాలర్లు, ఇతర నేరపూరిత నష్టాలకు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే.. ఆ తర్వాత ఈ పరిహారాన్ని 10.35 మిలియన్ డాలర్లకు కుదించింది. అటు.. జానీ న్యాయవాది చేసిన ఆరోపణల వల్ల తన పరువుకి నష్టం వాటిల్లిందని అంబర్ చెప్పడంతో, ఆమెకు 2 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందిగా జానీకి జ్యూరీ ఆదేశించింది.
కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అంబర్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కోర్టులోనే కన్నీళ్ళు పెట్టుకున్న ఆమె.. ట్విటర్ వేదికగా తన మాజీ భర్త పరపతితోనే ఈ కేసు గెలిచాడని ఆరోపించింది. ఇది తన ఒక్క ఓటమి మాత్రమే కాదని, మహిళలందరిది అని చెప్పుకొచ్చింది. మహిళలపై జరుగుతున్న వేధింపుల మీద గళమెత్తినందుకు తనని అవమానించారని వాపోయింది. అటు.. జానీ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాడు. ఆరేళ్ళ క్రితం తన మీద వచ్చిన ఆరోపణల కారణంగా జీవితం గందరగోళంగా మారిపోయిందని, ఇప్పుడు ఈ జ్యూరీ తన జీవితాన్ని తిరిగిచ్చిందన్నాడు. నిజమేంటో ఈ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టానని జానీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!