JD Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు అని, వారిలో ఒకరు భారతీయురాలైన తన భార్య ఉషా, రెండో వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. భార్యను పాక్ ఆర్మీ చీఫ్‌తో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఈ రోజు మనం ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చిస్తున్నామని, అన్ని విభేదాలను పరిష్కరించకపోవచ్చని, కానీ దీని వల్ల మొదటిసారిగా అన్ని పక్షాలు ఒక జట్టుగా కూర్చున్నాయని అన్నారు. ముఖ్యమైన సమస్యల్ని ఎలా పరిష్కరించాలని, మెరుగైన భవిష్యత్తు వైపు ఎలా పయనించాలో అర్థం చేసుకోవడానికి ఈ చర్చలు సహాయపడుతాయని చెప్పారు. కొన్ని గంటల చర్చల్లో తాము గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు.
మధ్యప్రాచ్యంలో శాశ్వత కాల్పుల విరమణ అమలు చేయడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని వాన్స్ అన్నారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగేలా చూడటంతో పురోగతి చూశామని చెప్పుకొచ్చారు. శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయగల భవిష్యత్తును ఇప్పుడు చూస్తున్నామని అన్నారు.

