PM Modi Invited to Peace Summit by Trump: ప్రధాని మోడీకి ట్రంప్ నుంచి ఆహ్వానం లభించింది.. అక్టోబర్ 13, సోమవారం షర్మెల్ షేక్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. శనివారం చివరి నిమిషంలో ఈ ఆహ్వానం అందిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
Trump: గాజాలో రెండు సంవత్సరాలు కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని చారిత్రక, అపూర్వమైన అడుగుగా అభివర్ణించారు. ఈజిప్టులో జరిగిన చర్చల అనంతరం.. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ బందీలను విడుదల చేస్తుందని, ఇజ్రాయెల్ తన దళాలను అంగీకరించిన లైన్‌కు తిరిగి తీసుకువస్తుందని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు 20 పాయింట్ల శాంతి ఒప్పందంపై సంతకం చేసినట్లు స్పష్టం…