Gerogia Meloni: బుర్ఖా, నిఖాబ్‌పై ఇటలీ బ్యాన్.. మెలోని సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gerogia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది. ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్‌లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది.
ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పింది. మెలోని ప్రభుత్వంలోని ముగ్గురు ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, దుకాణాలు, కార్యాలయాలలో ముఖం కప్పి ఉంచే దుస్తులను నిషేధించాలని పిలుపునిచ్చింది.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
Read Also: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్.. ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
ఈ బిల్లును రూపొందించిన వారిలో ఒకరిగా భావిస్తున్న ఎంపీ ఆండ్రియా డెల్మాస్ట్రో బుధవారం సోషల్ మీడియా వేదికగా ఈ బిల్లు గురించి సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “మత స్వేచ్ఛ పవిత్రమైనది, కానీ దానిని బహిరంగంగా, మన రాజ్యాంగం, ఇటలీ సూత్రాల పట్ల పూర్తి గౌరవంతో ఉపయోగించుకోవాలి” అని అన్నారు. ఇస్లామిక్ ఫండమెంటలిజం వ్యాప్తి స్పష్టంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోందని, ఈ బిల్లు మత తీవ్రవాదం, మతం ఆధారంగా ద్వేషాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఈ బిల్లు పేర్కొంది.
ఎవరైన ఉల్లంఘనలకు పాల్పడితే 300-3000 యూరోలను జరిమానాగా విధిస్తారు. మన భారతీయ కరెన్సీలో రూ. 30,959 – రూ. 3,09,588. మతపరమైన ఒత్తిడితో బలవంతపు వివాహాలకు శిక్షలను మరింత కఠినం చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు ఇటాలియన్ మసీదుల నిధులను నియంత్రించాలని కూడా ప్రతిపాదించింది. దేశ ప్రాథమిక స్వేచ్చ, భద్రతకు విరుద్ధ భావజాలనున ప్రచారం చేసే వ్యక్తలను, సంస్థల నుంచి విరాళాలు స్వీకరించినట్లు తేలితే అన్ని ముస్లిం సంస్థలపై భారీ జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?