Jaish-e-Mohammed: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదం కోసం ఇప్పుడు మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. జైషే చీఫ్ మసూద్ అజార్ 21 నిమిషాల ఆడియోలో ఉగ్రవాదులుగా మహిళల్ని నియమించడం, శిక్షణ ఇవ్వడం గురించి ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రసంస్థ భారత వ్యతిరేక ప్రచారంతో బ్రెయిన్ వాష్ చేస్తోంది.
Gerogia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది. ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్‌లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది. ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు…