ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు పూర్తి స్థాయి విరమణకు అంగీకరించాయని.. 24 గంటల్లో దశలవారీగా అమలు చేయనున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
=ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ప్రధాన శత్రువు ట్రంపేనని.. ఆయనను చంపాలని టెహ్రాన్ కురుకుంటోందని తెలిపారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం సాగుతోంది. ఇరుపక్షాలు క్షిపణులు ప్రయోగించుకుంటున్నారు. దీంతో ఆస్తితో పాటు ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇరాన్-ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేసుకోవాలని.. ఇదే అనుకూల సమయం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు.