Iran Protests: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..
- ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న యూఎస్.!
- అమెరికా జోక్యం నేపథ్యంలో ఇజ్రాయిల్ అలర్ట్..
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Protests: ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. మరోవైపు, నిరసనల్ని అణిచివేసేందుకు మతప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలను అగ్రరాజ్యం అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ ‘‘పెద్ద ఇబ్బందుల్లో’’ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘ఇరాన్ పెద్ద ఇబ్బందుల్లో ఉంది. కొన్ని వారాల క్రితం నిజంగా సాధ్యమేనా అని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని నగరాలను ప్రజలు స్వాధీనం చేసుకున్నట్లు నాకు అనిపిస్తోంది’’ అని ట్రంప్ అన్నారు.
Read Also: Bhartha Mahasayu Laku WignyaPthi : సెన్సార్ కంప్లీట్ చేసుకున్న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ..
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ప్రారంభం
- 900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్‌లో ఏం జరిగింది.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
ఇదిలా ఉంటే, ఇరాన్ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఏర్పడటంతో అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై యూఎస్ దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయిల్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ హైఅలర్ట్‌లో ఉంది. ఇరాన్ పరిణామాల గురించి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ.. ఇరాన్ ఇజ్రాయిల్‌పై దాడి చేస్తే భయంకరమైన పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, అంతర్గత అస్థిరత ఇజ్రాయిల్ వ్యూహాత్మక లెక్కల్ని ప్రభావితం చేస్తుందని అన్నారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఇజ్రాయిల్ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల్లో ఇరాన్లో అమెరికా జోక్యం చేసుకునే అవకావం ఉందని తెలుస్తోంది. గతంలో ఇరాన్ నిరసనల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. నిరసనకారులకు హాని కలిగిస్తే, అమెరికా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
-
Harry Brook: టీమిండియా ఓడిపోతుంటే ఫుల్ హ్యాపీగా ఉంది.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
-
Prabhas : ‘ఫౌజీ’ బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
-
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!