Iran Protests: ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. మరోవైపు, నిరసనల్ని అణిచివేసేందుకు మతప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
Iran Nuclear Program: టెహ్రాన్‌లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు,…