Israel: ట్రంప్ మాటల్ని లెక్కచేయని నెతన్యాహూ..
- ట్రంప్‌ను లెక్కచేయని నెతన్యాహూ..
- లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్..
- ఇలాగైతే చర్చలు నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఓ వైపు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ మరోవైపు, ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బోల్లా లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ దాడులు ఇరాన్,యూఎస్ మధ్య కాల్పుల విరమణకు ముప్పు తెచ్చాయి. లెబనాన్‌పై దాడులు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కోరిన కొద్దిసేపటికే లెబనాన్‌లోని రెండు పట్టణాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది.
Read Also: Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.
Also Read
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
మొత్తంగా చూస్తే ట్రంప్‌ను అసలు నెతన్యాహూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ‘ఉల్లంఘించిందని’ ఆరోపిస్తూ, దానికి ప్రతిస్పందనగా తాము కూడా ఉత్తర ఇజ్రాయెల్ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్నామని లెబనాన్‌లోని ఇరాన్ అనుచర సంస్థ హిజ్బుల్లా తెలిపింది. శుక్రవారం ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు సమీపంలోని కిరియత్ ష్మోనాపై, ఉత్తర ఇజ్రాయెల్‌లోని అప్పర్ గలీలీ ప్రాంతంలో ఉన్న మిస్గావ్ ఆమ్పై రాకెట్లను ప్రయోగించినట్లు ఈ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మా దేశం, మా ప్రజలపై ఇజ్రాయిల్, అమెరికా దురాక్రమణ ఆగే వరకు ఈ ప్రతిస్పందన ఇలాగే కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొంది.
అమెరికా కుదుర్చుకున్న ఒప్పందంలో లెబనాన్‌పై దాడుల్ని ఆపేయడం కూడా ఉందని టెహ్రాన్ చెబుతోంది. అయితే అలాంటిదేం లేదని ఇజ్రాయిల్, అమెరికా వాదిస్తున్నాయి. ఇలాగే లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగితే కాల్పుల విరమణ ఉండదని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ హెచ్చరించింది. ఇజ్రాయిల్ దాడులు వల్ల చర్చల ప్రక్రియ నిలిపివేయబడుతుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!