గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ మాయాజాలకారుడు ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి, విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది, మూవీ పై హైప్ మరింత పెరిగింది. డి గ్లామరస్‌గా చరణ్ లుక్ మాత్రం అధిరిపోయింది అని చెప్పాలి. ఒకే ఒక్క బాల్ షాట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఇక తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌పై సంచలన సమాచారం బయటకు వచ్చింది.
Also Read : SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?
ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లీక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి సొంతం చేసుకుందని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.105 కోట్లకు తీసుకుందట. ఈ రేటు, తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన డిజిటల్ రైట్స్ ఒప్పందాల్లో, టాప్ రేంజ్‌లో నిలిచింది. దీని గురించి అధికారికంగా ప్రకటన రానప్పటికీ, ఈ వార్త తో సినిమాపై ఉన్న క్రేజ్ మరింత పెరింగింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.