Israel Attack On Gaza: పాలస్తీనా గాజా సిటీలోని మిలిటెంట్లు లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ ‘ బ్రేకింగ్ డాన్ ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా దాడులను చేసింది. ఈ వారం ప్రారంభంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సీనియర్ మిలిటెంట్ ను ఇజ్రాయిల్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి ఇటు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది.