Iran-US: రేపటితో ముగుస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం.. మళ్లీ మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్పదా?
- రేపటితో ముగుస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం
- అమెరికాతో చర్చలకు ఇరాన్ నిరాకరణ
- బెదిరిస్తే చర్చలు జరపబోమన్న ఇరాన్
- ఒప్పందం చేసుకోకపోతే దాడులుంటాయన్న ట్రంప్
- మళ్లీ మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తోంది. మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరలేదు. వాస్తవంగా మంగళవారం ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరగాల్సి ఉండగా నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాతో చర్చలు ఉండబోవని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా బెదిరిస్తోందని.. ఇలాంటి ధోరణి ఉన్నప్పుడు చర్చలు ఎలా జరుపుతామని ఇరాన్ పేర్కొంది. మరోవైపు హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ నౌకలపై దాడులు చేయడంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది.
అయితే గడువులోగా ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. బ్రిడ్జ్‌లు, విద్యుత్ ప్లాంట్లపై భీకర దాడులు ఉంటాయని ట్రంప్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇంకా ముగియలేదని.. మా పని కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలను చూస్తుంటే మరోసారి మధ్యప్రాచ్యంలో భీకర దాడులతో అట్టుడికే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేసేందుకు ఇరాన్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాన్ని చూశాయి. మరోసారి ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తే.. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ఉధృతం చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్, చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. మరోసారి పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే.. ప్రపంచ దేశాలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ట్రంప్ బెదిరింపులతో కాల్పుల విరమణ ఉల్లంఘనలతో దౌత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ బెదిరింపులకు టెహ్రాన్ లొంగదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగితే యుద్ధ భూమిలో కొత్త ఎత్తుగడలు వేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండానే అర్ధాంతరంగా చర్చలు ముగిశాయి. దీంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. రెండో విడత చర్చల కోసం కూడా పాకిస్థాన్ ప్రయత్నించింది. సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించి ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ సుముఖంగా లేనట్లుగా సమాచారం. చర్చలపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో 24 గంటల తర్వాత మధ్యప్రాచ్యంలో ఏం జరగబోతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?