Iran: యుద్ధంపై ఇరాన్ సంచలన ప్రకటన.. ఆ దేశాలకు క్షమాపణ
- యుద్ధంపై ఇరాన్ సంచలన ప్రకటన
- గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ
- ఇజ్రాయెల్, అమెరికాకు లొంగే ప్రసక్తే లేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యం యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. టెలివిజన్‌లో కీలక ప్రసంగం చేశారు. పక్క దేశాలపై దాడులు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు దేశాలకు కూడా క్షమాపణలు చెప్పారు. ‘‘మా జోలికి రాకుంటే.. మీ జోలికి రాబోం.. ఇజ్రాయెల్, అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు.’’ అని తేల్చి చెప్పారు. లొంగిపోవాలని కలలు కనే వారు కచ్చితంగా విఫలమవుతారన్నారు.
ప్రసంగ సమయంలో మసౌద్ పెజెష్కియన్ శాంతి హస్తాన్ని చూపారు. ఇరాన్ శాంతిని ప్రేమించే దేశమని.. ప్రాంతీయ స్థిరత్వం కోసమే సైనిక చర్యను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన సార్వభౌమాధికారంపై దృఢమైన వైఖరిని తీసుకున్నట్లు వివరించారు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇదిలా ఉంటే పెజెష్కియన్ టెలివిజన్ ప్రసంగానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా మద్దతు ఇస్తుందని పుతిన్ వెల్లడించారు. ఏదైనా సమస్యను బలవంతంగా కాకుండా చర్చలు.. దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
అయితే అంతర్జాతీయ ఒత్తిడితోనే ఇరాన్ వైఖరి మారినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ భయాలు తారాస్థాయికి చేరడంతో ఇరాన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!