OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Movies : ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. యాక్షన్, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా ఇలా విభిన్న జానర్లలో ఆసక్తికరమైన కంటెంట్ ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వస్తోంది. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిన కొన్ని సినిమాల ఓటీటీలో అలరించబోతున్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ కథల నుంచి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ల వరకు వీకెండ్ బింజ్ వాచ్‌కు సిద్ధంగా ఉండండి.
1. బ్లాస్ట్ (Blast)
ఈ వారంలో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ ఒకటి. జూన్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఒక సాధారణ కుటుంబం అనుకోకుండా ఒక శక్తివంతమైన వ్యాపార సంస్థ కుట్రలో చిక్కుకున్న తర్వాత వారి జీవితాలు ఎలా మారిపోతాయనే కథాంశంతో రూపొందింది. కుటుంబ బంధాలు, యాక్షన్ థీమ్స్ తో ఈ సినిమా థియేటర్లలో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా అలరిస్తోంది.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
2. మమ్మతియాన్ స్టార్స్ (Mammatiyaan Stars)
ఎంఎస్ ధోనీపై అభిమానాన్ని ప్రధాన కథగా తీసుకుని రూపొందిన ‘మమ్మతియాన్ స్టార్స్’ మరో ఆసక్తికరమైన సిరీస్. జూన్ 26 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ యాక్షన్ డ్రామాలో ఒక గ్రామానికి చెందిన స్నేహితులు ధోనీ మ్యాచ్ చూడటానికి చెన్నై వెళ్లి, నకిలీ టికెట్ల కారణంగా ఊహించని పరిస్థితుల్లో చిక్కుకోవడంతో కథ ఇంటెన్స్ గా సాగుతుంది. క్రికెట్ నేపథ్యంతో సాగే ఈ సిరీస్ యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది.
3. బ్రేక్ ఫాస్ట్ (Breakfast)
రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారికి ‘బ్రేక్‌ఫాస్ట్’ మంచి ఎంపికగా కనిపిస్తోంది. జూన్ 24 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రంలో విడిపోవాలనుకుంటున్న ఓ జంట, మరో జంట కథ ద్వారా తమ సంబంధాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సంబంధాల విలువ, ప్రేమలో వచ్చే మార్పులను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమా చూపిస్తుంది.
4. మూండ్రం కన్ (Moondram Kan)
మిస్టరీ, సస్పెన్స్ అభిమానుల కోసం మూండ్రం కన్ సిద్ధంగా ఉంది. జూన్ 26 నుంచి సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమింగ్ కానున్న ఈ థ్రిల్లర్‌లో ఒక ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ హత్య కేసు విచారణ అనేక రహస్యాలను బయటకు తీసుకొస్తుంది. ప్రతి పాత్ర వెనుక ఉన్న సీక్రెట్స్ కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయి. ఇదే రోజు జియోహాట్‌స్టార్‌లో విడుదల కానున్న ‘లింగం’ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ కూడా కబడ్డీ నేపథ్యంలో సాగే విభిన్న కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జీవితంలో ఎదురైన అనుకోని సంఘటనలతో తన లక్ష్యాల కోసం పోరాడే ఓ క్రీడాకారుడి ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది.
5. బాహుబలి: ది టార్చ్‌బేరర్ (Baahubali: The Torchbearer)
ఈ వారంలో అందరి చూపు ఈ డాక్యు సిరీస్ పైనే ఉంది. ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ బాహుబలి ఫ్రాంచైజీ పదేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విజన్‌ను, ప్రభాస్, రానా దగ్గుబాటి సహా నటీనటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి సృష్టించిన ప్రభావాన్ని మరోసారి గుర్తు చేసే ఈ డాక్యు సిరీస్ ఫ్రాంచైజీ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీ వేదికల్లో ప్రతి రకం ప్రేక్షకుడి అభిరుచికి తగ్గ కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. యాక్షన్ నుంచి ఎమోషన్ వరకు, మిస్టరీ నుంచి డాక్యుమెంటరీల వరకు వైవిధ్యమైన కథలు సిద్ధంగా ఉండటంతో ఈ వీకెండ్‌ను వినోదభరితంగా మార్చుకోవడానికి ప్రేక్షకులకు మంచి అవకాశమే లభించింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!