Iran: ఖమేనీ అంత్యక్రియలకు ‘‘ట్రిపుల్ హెచ్’’.. ఇజ్రాయిల్‌కు ఇరాన్ వార్నింగ్..
- ఖమేనీ అంత్యక్రియలకు హౌతీలు, హమాస్, హిజ్బుల్లా ప్రతినిధుల హాజరు.
- 'ప్రతిఘటన కూటమి' ఇంకా బలంగా ఉందని ఇరాన్ సంకేతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు నివాళులు అర్పిస్తున్నారు. కోట్లాదిగా ఇరాన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం తర్వాత కూడా తమ ‘‘కూటమి’’ బలంగా ఉందని నిరూపించుకుంటోంది. ముఖ్యంగా ‘‘ట్రిపుల్ హెచ్’’ అంటే హౌతీలు, హమాస్, హిజ్బుల్లాకు చెందిన కీలక ప్రతినిధులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తమ ‘‘ప్రతిఘటన కూటమి’’ ఇంకా ముగిసిపోలేదని మిడిల్ ఈస్ట్ రాజకీయాలకు మరోసారి గుర్తు చేసింది.
ముఖ్యంగా, ఇజ్రాయిల్‌కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధం, గాజా యుద్ధాల తర్వాత ఈ మూడు శక్తులు నాశనమయ్యాయని అంతా భావించారు. కానీ ఇంకా కథ మిగిలే ఉందని ఇరాన్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ మిలిటెంట్ గ్రూపులు శనివారం ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇదే కాకుండా హిజ్బుల్లా, హమాస్ ప్రతినిధులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో సమావేశమయ్యారు. అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఈ మూడు సంస్థల్ని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి.
Also Read
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
పాలస్తీనా ముఖ్యంగా గాజాలో హమాస్, లెబనాన్ దక్షిణ భాగంలో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు చాలా ఏళ్లుగా ఇరాన్ సహాయం చేస్తుందనేది బహిరంగ సత్యం. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఈ మూడింటిని ఇరాన్ ప్రాక్సీలుగా వాడుకుంటోంది. 2023 అక్టోబర్ 7 నాటి ఇజ్రాయిల్ దాడి ఘటనలో హమాస్‌కు ఇరాన్ సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ హమాస్ హై లెవల్ లీడర్షిప్ను తుడిచిపెట్టేసింది. మరోవైపు, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా దాడులు చేస్తే, వారిని కూడా ఇజ్రాయిల్ చావు దెబ్బ కొట్టింది. అయినప్పటికీ, ఈ రెండు గ్రూపులు ఇంకా మిగిలే ఉన్నాయనే సందేశాన్ని ఇరాన్ ఇచ్చినట్లు అయింది.
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!