Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..
- మానవ కవచాలుగా మారండి..
- ఇరాన్ యువతకు ప్రభుత్వం పిలుపు..
- అమెరికా దాడుల నుంచి రక్షించుకునే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. మరోసారి గడువు పెంచేది లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో అమెరికా, ఇరాన్ విషయంలో ఏం చేస్తుందని ప్రపంచమంతా భయాందోళనకు గురవుతోంది. ఇరాన్ డీల్ చేసుకోకపోతే తీవ్రమైన దాడులు చేస్తామని, బ్రిడ్జ్‌లు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దాడుల కోసం సిద్ధమవుతోంది. ఇరాన్ కీలక విద్యుత్ కేంద్రాల వద్ద ‘‘మానవ గొలుసు(హ్యూమన్ చైన్)’’ ఏర్పాటు చేయాలని తన ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులతో సహా దేశ యువతను మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటల (స్థానిక సమయం) నుండి ఆ ప్రదేశాల చుట్టూ గుమిగూడాలని ఇరాన్ క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
Read Also: Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఇచ్చిన గడువు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలతో ముగుస్తోంది. ఈ మావన కవచాలు అనే ఆలోచన స్వయంగా యువత ఇచ్చిందే అని ఇరాన్ మంత్రి అలీ రెజా రహీమీ ఒక వీడియోలో చెప్పారు. దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ ఒక మానవ కవచం ఏర్పాటు చేయాలని పలువురు యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిపాదించారని అన్నారు. ఇలా దేశ మౌలిక సదుపాయాలను రక్షిస్తామని ఆయన చెప్పారు.
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను ఒక రోజులో నాశనం చేయగలని, ఆ రోజు రేపే కావచ్చని హెచ్చరించారు. ఇకపై ఇరాన్‌కు గడువు పెంచేది లేదని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛా వాణిజ్యం కోసం తెరవాలని లేకపోతే నాశనమవుతారని హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?