Kuwait-Iran: కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్
- కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి
- తిప్పికొట్టిన కువైట్ రక్షణ దళాలు
- పశ్చిమాసియాలో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆరోపించింది. బుధవారం రాత్రి కువైట్ లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని.. అలాగే హార్ముజ్ జలసంధి సమీపంలో ఐదు వన్‌వే అటాక్ డ్రోన్లను మోహరించిందని వెల్లడించింది.
సెంట్కామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే 27 రాత్రి 10:17 గంటలకు ఇరాన్ నుంచి కువైట్ వైపు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిందని.. అయితే కువైట్ రక్షణ దళాలు దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది.
Also Read
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
అదే రోజు కొన్ని గంటల ముందు హార్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా, మిత్రదేశాల భద్రతకు ముప్పుగా మారేలా ఐదు వన్‌వే అటాక్ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించినట్లు పేర్కొంది. వాటన్నింటినీ అమెరికా బలగాలు కూల్చివేశాయని వెల్లడించింది. అదనంగా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ సైట్ దగ్గర మరో డ్రోన్ ప్రయోగాన్ని కూడా అమెరికా బలగాలు అడ్డుకున్నట్లు తెలిపింది.
“ఇరాన్ పాలకులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా, భాగస్వామ్య దేశాలకు ముప్పుగా మారే చర్యలకు పాల్పడ్డారు” అని సెంట్కామ్ ఆరోపించింది. అమెరికా, ప్రాంతీయ భాగస్వామ్య దేశాల బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. ఇరాన్ దూకుడును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.
ఇక ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల మధ్య చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధిలో రాకపోకల భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై ఇప్పటికే పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజా దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!