Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
- నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది
- ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
- కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జకార్తాలోని భారతీయ ప్రవాసుల సభలో మాట్లాడిన వ్యాఖ్యలు భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన డీఎన్ఏ పరీక్షలో భారతీయ మూలాలు ఉన్నట్లు తేలిందని వెల్లడించగా.. సభలో ఉన్న భారతీయులు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ‘‘మీ ఒక్క మాట కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకుంది’’ అంటూ ప్రశంసించారు.
జకార్తాలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడిన ప్రబోవో సుబియాంటో.. భారత పర్యటనకు ముందు తాను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. ‘‘భారత్‌కు అధికారిక పర్యటనకు వెళ్లే ముందు నేను డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు భారతీయ డీఎన్ఏ ఉన్నట్లు తెలిసింది. అందుకే భారతీయ సంగీతం వినిపించిన ప్రతిసారీ నా శరీరం తనంతట తానే కదలడం ప్రారంభిస్తుంది’’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలోని భారతీయులు చప్పట్లు, హర్షధ్వానాలతో స్పందించారు. అంతేకాకుండా తన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు, సైనికాధికారులు కూడా భారతీయ సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారని పేర్కొంటూ.. ‘‘బహుశా వాళ్లకూ భారతీయ డీఎన్ఏ ఉండొచ్చు’’ అని సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి.
Also Read
- Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
- 9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
ఇండోనేషియా అధ్యక్షుడు భారత్‌తో తమ దేశానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని కూడా ప్రస్తావించారు. ఇండోనేషియా సంస్కృతి, నాగరికతపై భారతీయ నాగరికత ప్రభావం ఎంతో ఉందని పేర్కొన్నారు. ‘‘మా నాగరికత, సంస్కృతి భారత నాగరికత ప్రభావంతో బలంగా రూపుదిద్దుకుంది. మా భాషలో దాదాపు 50 శాతం పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. మా దేశంలోని అనేక పేర్లు కూడా సంస్కృత మూలాలవే. భారత్ నుంచి మేము ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి.’’ అని ప్రబోవో అన్నారు.
మోడీ స్పందన
ప్రబోవో వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే విషయం చెప్పారని గుర్తు చేస్తూ.. ‘‘మీరు అప్పుడూ ఇదే చెప్పారు.. ఈరోజూ అదే చెప్పారు. మీరు భారత డీఎన్ఏ ఉందని చెప్పినప్పుడు సభలో అత్యధిక చప్పట్లు వినిపించాయి.’’ అని అన్నారు. ‘‘మీ ఆ ఒక్క వ్యాఖ్య కోట్లాది భారతీయుల మనసులను గెలుచుకుంది. అది కేవలం డీఎన్ఏ కాదు.. పరస్పర విశ్వాసానికి ప్రతీక. ఉమ్మడి వారసత్వానికి నిదర్శనం.’’ అని మోడీ పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్‌కు నిజమైన మిత్రదేశమని, తన పర్యటనకు చూపిన ఆతిథ్యం, గౌరవానికి అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఈ కార్యక్రమానికి ముందు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో.. భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీకి ఇండోనేషియాలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘‘బింటాంగ్ రిపబ్లిక్ ఇండోనేషియా ఆదిపుర్ణ’’ను ప్రదానం చేశారు.
#WATCH | Indonesia: At a community event in Jakarta, President of Indonesia Prabowo Subianto says, "… Just before I made my state visit to India, I had a what is called a genome sequencing test. I tested my DNA and I found out I had Indian DNA. And that's why I think every… pic.twitter.com/CRT0WqjImD
— ANI (@ANI) July 7, 2026
తాజావార్తలు
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!