మయన్మార్‌కు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆదివారం భారీగా సాయం పంపించింది. శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించారు. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని పంపించారు.
Operation Brahma: భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కి ఇండియా ఆపన్నహస్తం అందిస్తోంది. శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. అయితే, భూకంప బాధిత మయన్మార్‌కి సాయం చేసేందుకు భారత్ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ని ప్రారంభించింది. శనివారం ఆ దేశానికి 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. భారత వైమానిక దళం(ఐఎంఎఫ్) C130J సైనిక రవాణా విమానంలో హిండన్…