Operation Brahma: భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కి ఇండియా ఆపన్నహస్తం అందిస్తోంది. శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. అయితే, భూకంప బాధిత మయన్మార్‌కి సాయం చేసేందుకు భారత్ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ని ప్రారంభించింది. శనివారం ఆ దేశానికి 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. భారత వైమానిక దళం(ఐఎంఎఫ్) C130J సైనిక రవాణా విమానంలో హిండన్…