India-Srilanka: శ్రీలంకకు ఇండియా ఆపన్నహస్తం.. ఊరటనిచ్చేలా కీలక ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్‌తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. గతంలో కొలంబో పాలకులు భారత్‌ను కాదని ఇతర దేశాలకు దగ్గరయ్యేందుకు యత్నించారు. ప్రత్యేకించి డ్రాగన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు శ్రీలంకను రుణ ఊబిలోకి నెట్టేశాయి. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఆప్త మిత్రదేశం ఇండియాతో పలు ఒప్పందాలు కుదుర్చుకొంటూ కొలంబో వడిగా అడుగులు వేస్తోంది. భారత్ గతంలో వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించింది.
తాజాగా యూరియా కొనుగోలు కోసం పొరుగు దేశానికి 55 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ లైన్ అందించాలని భారత్ నిర్ణయించింది. అత్యవసరంగా సాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం అర్థించడంతో భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ లైన్‌కు సంబంధించి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింగే, వ్యవసాయ మంత్రి మహీంద్ర అమరవీర, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే సమక్షంలో శ్రీలంక ప్రభుత్వం, ఎక్స్పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలంబోలో శుక్రవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Also Read
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
శ్రీలంకలో వర్షకాల సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు నాటేందుకు సరిపడా యూరియా నిల్వలు కూడా శ్రీలంకలో లేవు. దీంతో అత్యవసర వినియోగానికి 65 వేల టన్నుల యూరియా కొనుగోలు కోసం శ్రీలంక ప్రభుత్వం భారత్‌ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఇండియా.. శ్రీలంకకు తక్షణమే రుణం రూపంలో యూరియా పంపేందుకు ముందుకొచ్చింది. రసాయన ఎరువులును దిగుమతి చేసుకోకుండా సేంద్రీయ సాగు వైపు మళ్లాలని గతంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శ్రీలంకలో పంట దిగుబడులు 50 శాతం తగ్గాయి. ఫలితంగా ఆహార కొరత తలెత్తింది.
సంక్షోభ సమయంలో లంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమ సింఘే ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆపత్కాలంలో ఆదుకున్న భారత ప్రభుత్వానికి లంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇస్తోన్న భారత్.. చిరకాల మిత్రుడు అయిన శ్రీలంకకు కూడా అనేక విధాలు సాయం అందిస్తోందని శ్రీలంకలోని భారత హైకమిషన్ వెల్లడించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కనీవిని ఎరగని రీతిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు.. భారత్ ఇప్పటి వరకూ దాదాపు 3.5 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేసింది.
తాజావార్తలు
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!